Jun 12,2023 08:02

తెల్లని మల్లెల మాలలు మీరే
జాబిలి వెన్నెల చలువలు మీరే!
చదువులు బాగా చదవండీ!
ప్రథమ స్థానం పొందండీ !

కలువల కన్నుల కాంతులు మీరే!
తీయని మాటల మూటలు మీరే!
అల్లరి చేయక మెలగండీ!
బుధ్ధిగ మసలుతూ ఉండండీ!

మింటిలో వెలిగే తారలు మీరే!
అమ్మకు నాన్నకు ఆశలు మీరే!
ఆటలు అన్నీ ఆడండీ!
ఆరోగ్యంగా ఉండండి!

బుడిబుడి నడకల బుడతలు మీరే!
జగతిన విరిసిన పూవులు మీరే!
ఆనందగా ఉండండీ!
ఆహ్లాదాన్ని పొందండీ!

మెత్తని మల్లెల మనసులు మీరే!
సుందర వనముల తావులు మీరే!
మంచి పౌరులుగా మెలగండీ!
దేశకీర్తినీ పెంచండీ!
 

- రావిపల్లి వాసుదేవరావు,
94417 13136