
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు అర్హత కలిగిన అభ్యర్థులకు సెప్టెంబరు 4న ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రటనలో పేర్కొన్నారు. మిగిలిన సీట్లకు 5న మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పదవ తరగతి చదివి, పాలిటెక్నిక్ ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న, దరఖాస్తు చేయని అర్హులైన అభ్యర్థులు మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చునని తెలిపారు.