ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఒక్కపని కూడా చేయించుకోలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు. తన వార్డులో అత్యవసర కల్వర్టు నిర్మించకపోవడం వల్ల ప్రజల ముందు తలెత్తుకోలేక పోతున్నానని అవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకుంటనని అసహనం వ్యక్తం చేసారు.










