Oct 10,2023 21:20

న్యూఢిల్లీ : కాఫీ బ్రాండ్‌ భారత్‌లో 150 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. నూతన స్టోర్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరినట్లు పేర్కొంది. కోకా కోలాకు చెందిన ఈ బ్రాండ్‌ 2005లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. దేవయాని ఇంటర్నేషనల్‌ సహకారంతో విస్తరించింది. దేశంలోని టాప్‌ 8-10 నగరాల్లో కొత్త స్టోర్‌లను ప్రారంభించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోస్టా కాఫీ ఇండియా జిఎం వినరు నాయర్‌ పేర్కొన్నారు.