
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే. సాయిచంద్ అంత్యక్రియలు నిన్న హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ శ్మశానవాటికలో జరిగాయి. అయితే, సాయిచంద్ అంత్యక్రియలపై వివాదం ఏర్పడింది. ఉద్యమకారుడు సాయిచంద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సాయన్న మఅతి సమయంలోనూ ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు దళితులను అవమానించడమేనని విమర్శించారు. ఏపీ ప్రముఖులకు, నిజాం వారసులకు ఇచ్చిన గౌరవం దళిత నేతలకు కేసీఆర్ ఇవ్వడంలేదని పేర్కొన్నారు.