
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : రైల్వే కోడూరు మండలం కె.బుడుగుంటపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో క్రీడా మైదానంలో మంగళవారం ఎస్‌జిఎఫ్‌ఐ కోఆర్డినేటర్ డేవిడ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రసాద్ మాట్లాడుతూ.. వివిధ క్రీడల్లో నైపుణ్యం కనపరిచిన టీమ్‌ను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపిస్తామని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట,పెనగలూరు, చిట్వేలి మండలాల నుంచి 10 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు తెలిపారు. అండర్-14, అండర్ - 17 విభాగాల్లో కబడ్డీ, కోకో టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, త్రోబాల్, యోగ వంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్ రాజు,పీఈటీలు భాస్కర, సుబ్రహ్మణ్యం, చంద్రకుమార్,ప్రదీప్, రాధారాణి,లక్ష్మి దేవి,విద్యార్థులు పాల్గొన్నారు.