ప్రభుత్వ సిటీ కళాశాల (నయాపూల్, హైదరాబాద్), తెలుగు శాఖ ఆధ్వర్యంలో మార్చి 9,10 తేదీలలో తెలుగు సాహిత్యం-పర్యావరణ చైతన్యం అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ ఆర్ధిక సౌజన్యంతో కళాశాల ఆజామ్ హాల్లో జరిగే ప్రారంభ సభలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా, మున్సిపాల్ పరిపాలన, నగరాభివృద్ధి విభాగం, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవిందకుమార్, వాణీ ప్రసాద్, డా.మామిడి హరికృష్ణ, దుశ్చర్ల సత్యనారాయణ అతిథులుగా పాల్గొంటారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. బాల భాస్కర్ అధ్యక్షత వహిస్తారు. డా. నాగసూరి వేణు గోపాల్ కీలకోపన్యాసం చేస్తారు. గౌరీ కృపానందన్, ఆచార్య కొలకలూరి ఆశాజ్యో, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొంటారు.
- డా.కోయి కోటేశ్వర రావు,
డా.జె.నీరజ
తెలుగు శాఖ










