Jul 24,2023 12:15

ఉంగుటూరు (ఏలూరు) : గ్రామ పంచాయతీలకు 14 ,15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడంపై ఉంగుటూరు మండలంలో చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, సీతారాంపురం గ్రామ మహిళా సర్పంచులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఏలూరులో జిల్లా కలెక్టర్‌ కి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు మహిళా సర్పంచులు వెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు రాకపోవటంతో పంచాయతీల్లో పారిశుధ్యం, నిర్వహణ పనులు ఆర్థిక భారంగా మారాయని మహిలా సర్పంచులు వాపోయారు.