అమరావతి: కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ డిగ్రీల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించారు. వీసీ తుమ్మల రామకఅష్ణపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శేషశయనారెడ్డి నేతృత్వంలో విచారణ అథారిటీని గవర్నర్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా 356 పీహెచ్‌డీ డిగ్రీలను ఇచ్చేశారని ద్రవిడ విశ్వవిద్యాలయం వీసీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ అథారిటీని నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు ఇచ్చారు.










