హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ధర్మాసనానికి ప్రభుత్వం వెల్లడించింది.''ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయి. త్వరలో సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాం. దీని కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలి'' అని ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో కేసును నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.










