Jun 17,2023 13:15

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూలు నగరాన్ని మెరుగైన పారిశుద్ధ్యంతో క్లీన్‌ సిటీగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఏ.భార్గవ్‌ తేజ అన్నారు. శనివారం నగరంలో తెలుగు వీధి, గాంధీ నగర్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆరోగ్యాధికారి విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి కమిషనర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనులపై స్థానికులతో చర్చించారు. కె.సి. కాలువను శుభ్రపరుస్తున్న తీరును పరిశీలించారు.