Jul 21,2023 11:46

వర్షాకాలంలో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. గతంలో ఎక్కువగా నల్లని గొడుగులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రంగురంగుల్లో రకరకాల వెరైటీలు వస్తున్నాయి. కొన్ని చిన్నగా మడతపెట్టే విధంగా ఉంటే.. కొన్ని తలకు టోపీ మాదిరి పెట్టుకునే విధంగా ఉంటున్నాయి. మరికొన్ని గొడుగులైతే అతినీలలోహిత కిరణాల నుంచి కూడా రక్షించేలా తయారుచేస్తున్నారు. ఈ సీజన్లో ముఖ్యమైన మార్కెట్లలో తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఏఏ గొడుగులు దొరుకుతున్నాయో తెలుసుకుందామా ?
ఎవర్‌ : ఇవి డబుల్‌ లేయర్‌ గొడుగులు. పరిమాణం కూడా చాలా చిన్నది. హ్యాండ్‌బ్యాగ్‌ లేదా బ్యాక్‌ప్యాక్‌లో సులభంగా తీసుకెళ్లొచ్చు.
ఆటోమేటిక్‌ ఓపెన్‌ ట్రావెల్‌ : ఈ రకానివి డబుల్‌ స్టీల్‌ నిర్మాణంతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దీని క్లాత్‌ వాటర్‌ ఫ్రూప్‌ పాలిస్టర్‌ ఫాబ్రిక్‌తో తయారవుతుంది. విండ్‌ వెంట్‌ ఫీచర్‌లో పెద్దగా ఉంది. ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది.
ప్లాంగో ఆటో ఓపెన్‌ క్లోజ్‌ ఫంక్షన్‌ : 110 సెంమీ వెడల్పు, 54 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇందులో ఇద్దరు తల దాచుకోవొచ్చు. ఆటో షట్‌ బటన్‌ ఉంటుంది. 8 స్టెయిన్లెస్‌ స్టీల్‌ రిబ్స్‌, ఫ్రేమ్‌తో ఆకర్షణీయంగా, దృఢంగా ఉంటుంది. మడత పెట్టడం సులభం.
యువి ప్రొటెక్షన్‌ : బ్లూ వైట్‌ కలర్‌ స్ట్రిప్‌ డిజైన్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫోటో షూట్‌ కోసం కూడా ఉపయోగించొచ్చు. విండ్‌ క్లాసిక్‌ గోల్ఫ్‌ పారాసోల్‌ ఉంటుంది. ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది, మూసుకుంటుంది. మన్నికైన చెక్క హ్యాండిల్‌ ఇస్తున్నారు.
విండ్‌ ప్రూఫ్‌ : ఇది విండ్‌ ప్రూఫ్‌ గొడుగు. రెండు వైపుల నుంచి ఉపయోగించొచ్చు. దీని ఎత్తు 81 సెం.మీ, వెడల్పు 107 సెం.మీ. ఇందులో సి టైప్‌ హ్యాండిల్‌ ఇస్తున్నారు. ఫ్రేమ్‌, క్లాత్‌ నాణ్యతతో తయారుచేస్తున్నారు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు.