ఏంటో, మరీ ఆ బేషరమ్?
ఊహకందని క్రూరత్వంతో
సాధుత్వపు ముసుగులో
దానవత్వపు వికటాట్టహాసం
ఇంకెంత ఉన్మాదం
ఆ అధికారం ఆవల దాగి ఉందో?
నలభై మంది దేశభక్తులను హత్య చేసి
పర దేశానికి భక్తిగా ప్రకటించింది
అందలమెక్కిన అహంలో
విషకరకుతనంతో విషాద ఛాయలు
ప్రభుత్వ పడకగదిలో
పట్టు పరుపు వేసుకుని
ఉరవడి పవళిస్తూ
లొట్టలేస్తున్న వేళ
పుల్వామాలో పారిన రక్తం
నేడు జలపాతమై
స్మృతిగీతి పాడుతూ ఉరికింది
పహారా పని మరిచి పరాయి
పటాసుల పక్కా పథకానికి పళ్లికిలిస్తూ
కాపాడాల్సిన కన్నే గన్నై
ప్రాణం కోసం విమానం అడిగితే
కనీస ప్రమాణాలు మరిచింది
పాడె మీద పేలాలేరుకునే
పాలకుల జమానాలో
మన రా'జీవనమే జుర్మానా
కానీండి, ఎప్పటికీ మాయని గాయంతో
ఘాతుకానికి పట్టాభిషేకం
దొడ్డి దారిలో అసత్య నిచ్చెనలెక్కండి
సత్యాన్ని కాండ్రించి ఉమ్మడానికి
కాల నాగులు పొంచి ఉన్నాయి
దేశాన్ని మట్టుబెట్టే దారులసాక్షిగా
నా మత జవాన్ల చితిలో
పేలిన తూటాలు యావత్ దేశం
సంచరిస్తూ పరిహారాన్ని ప్రశ్నిస్తున్నాయి
వడ్డీతో వసూల్ కై సవాల్ చేస్తున్నాయి.
- డా|| మాటూరి శ్రీనివాస్
సెల్ : 9849000037










