ప్రజాశక్తి-ఏలూరు : మాజీ సైనికోద్యోగులు సంక్షేమానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. కోటదిబ్బలోని ఏలూరు జిల్లా మాజీ సైనికోద్యోగుల అసోషియేషన్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమర్ జవాన్ స్మారక చిహ్నాన్ని (ఐకాన్) బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. తొలుత అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు లెఫ్ట్నెంట్ జనరల్ కె. ఆర్.రావు, లెఫ్ట్నెంట్ జనరల్ కె.జి.కష్ణ,ఉండవల్లి లత కూడా అమర జవానుల స్మారక చిహ్నానికి శ్రద్ధాంజలి ఘటంచారు. ఈసందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ఆర్మీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తాను ఎన్‌సిసిలో ఉన్నపుడు హవల్దార్ సత్యరాజన్ తమకు శిక్షణ అందించారన్నారు. ఎన్ సిసి క్యాడెట్ చేసే సమయంలో ఎన్ డిఏ పరీక్షకూడా వ్రాశానని అనంతరం సివిల్ సర్వీస్‌కు ఎంపిక కావడం జరిగిందన్నారు. తాము ఐఎఎస్ శిక్షణ సమయంలో ఆర్మీకి సంబంధించిన శిక్షణను చైనా సరిహద్దు సిక్కిం బోర్డర్ లో 15 రోజులు పాటు తీసుకోవడం జరిగిందనీ అక్కడ, ఇతర ప్రాంతాల్లో స్వయంగా చూసిన సైనికుల భాదలు, కష్టలు విశాదకరించారు. ఆసమయంలో హవల్దార్ సత్యరాజన్ తమను గుర్తించి తమతో మాట్లాడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సైనికుల పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేశారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమ బోర్డ్ తొలి సమావేశంలో అమర్ జవాన్ స్ధూపం (ఐకాన్) ఏర్పాటు, అసోషియేషన్‌కు కంప్యూటర్, ప్రింటర్ కోరడం జరిగిందని ఆ పనులు పూర్తికాగా ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కోరారని భూమి ఇస్తే ఆసుపత్రి నిర్మాణానికి నిధులు రావడం జరుగుతందని ఈ విషయంపై కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాను విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా తనను కలుసుకొనేందుకు వచ్చే మాజీ సైనికోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ జనరల్ కె.ఆర్ రావు మాట్లాడుతూ ఏలూరు పట్టణానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడానికి మన వంతు సహకారం ఇస్తామన్నారు. లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ మాట్లాడుతూ సైనికులకు ఎంత సహాయం చేసినా తొక్కే అవుతుందని సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతూ దేశానికి సేవ చేస్తామన్నారు. ఉండవల్లి లత మాట్లాడుతూ సైనికుల కోసం అందించిన సహాయం చాలా చిన్నదని వారి యొక్క సేవా కార్యక్రమాలు ముందు ఎక్కువే అవుతుందన్నారు. అసోసియేషన్ చైర్మన్ వాసుకి శర్మ మాట్లాడుతూ సైనికులు రంగంలోనూ సరిహద్దులో పహారా కాస్తున్న సమయంలోను అదేవిధంగా వివిధ యాక్సిడెంట్లలో సియాలిన్ సెక్టార్ లాంటి ప్రదేశంలో మంచు చర్యలు విరిగి పడటం వల్ల ప్రాణాలు కోల్పోయిన జవానులు చాలామంది ఉన్నారని వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించడం అన్నది మన యొక్క బాధ్యత అన్నారు వారిని గౌరవిస్తే అది దేశాన్ని గౌరవించినట్లే అదే దేశాన్ని గౌరవిస్తే మనల్ని మనమే గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు అందువల్ల అమర్ జవాన్ స్మార్ట్ చిహ్నం ఇక్కడ మనం నిర్మించడం జరిగిందన్నారు. చివరగా జాతీయగీతంతో వందన సమర్పణ చేశారు.











