
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో జిల్లా కలెక్టర్ గౌతమి శనివారం పర్యటించారు. మండల పరిధిలోని చింతకుంట, కందికాపుల గ్రామాల్లో అధికారులు కలిసి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలలతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ.. అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యోగానందారెడ్డి, ఎపిఓ చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.