Oct 28,2023 10:42

శ్రీనగర్‌ : జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో భారత్‌-పాకిస్థాన్‌ దళాల మధ్య సుమారు 8 గంటల పాటు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనతో గడిపారు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌ బసవ రాజ్‌కు స్వల్ప గాయాలయ్యాయని బిఎస్‌ఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. పాక్‌ కాల్పుల్లో అర్నియా పట్టణంలో రజినీ దేవి అనే సాధారణ మహిళ గాయపడ్డారని, అంతకు మించిన నష్టం జరగలేదని, అయితే సామగ్రికి నష్టం వాటిల్లిందని తెలిపారు. గురువారం రాత్రి 8 గంటలకు పాకిస్థాన్‌ వైపు నుంచి కాల్పులు, మోర్టార్‌ షెల్స్‌తో దాడితో ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఈ దాడిలో పౌరుల ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయి.