న్యూయార్క్ : ప్రముఖ గ్లోబల్ విత్త సంస్థ సిటీ గ్రూప్ ఉద్యోగుల్లో భయాలు మొదలయ్యాయి. సంస్థ చేపట్టిన ప్రక్షాళనకు అనుగుణంగా వ్యవహరించాలని లేదంటే సంస్ధను వీడాల్సి వస్తుందని హెచ్చరించడమే ఇందుకు కారణం. ఈ విషయమై 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగులను సిటీగ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేన్ ఫ్రెజర్ హెచ్చరించారు. 15 ఏళ్ల తర్వాత అతిపెద్ద సంస్థ పునర్‌వ్యవస్థీకరణను చేపడుతున్నట్లు ఫ్రెజర్ తెలిపారు. బ్యాంక్ కోసం ఉద్యోగులు అత్యున్నత ఆశయాలతో ముందుకెళ్లాలని.. వేగవంతమైన ప్రయాణంలో త్వరితగతిన తమతో పయనించాలని ఆమె కోరారు.