Apr 13,2023 21:46

హైదరాబాద్‌ : టాటా గ్రూప్‌కు చెందిన గృహోపకరణాల రిటైలర్‌ క్రోమా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు స్టోర్లను తెరిచినట్లు ప్రకటించింది. మదనపల్లె, ఒంగోలు, విజయవాడలో కొత్త స్టోర్‌లను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో 13 అవుట్‌లెట్‌లకు విస్తరించినట్లయ్యిందని పేర్కొంది. తమ స్టోర్లలో 550 కు పైగా బ్రాండ్లకు చెందిన 16వేలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ వెల్లడించింది.