రెడ్డిగూడెం (ఎన్టీఆర్) : ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండల కేంద్రంలో క్రైస్తవులు ఆదివారం ''శాంతి ర్యాలీ'' నిర్వహించారు. మణిపూర్, భారత దేశంలో క్రైస్తవులు, మైనార్టీలు, దళితులు, మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిగూడెం ప్రధాన సెంటర్లో మానవహారం, మోకాళ్ల పై ఉండి దేశంలో శాంతి కోసం ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ఐ సంఘ గురువులు రెవ జి విశ్వనాథ్, ఆర్ సి ఎం ఉపదేశి గూండ్రు ఏసు, సెవెన్త్ డే పాష్టర్ దానియేలు, మార్నింగ్ స్టార్ చర్చి పాష్టర్ ఎం యేసేపు, బేతేలు గాస్పెల్ హాల్ చర్చి పాష్టర్ ప్రత్తిపాటి పాల్‌ఇమ్మానుయేలు, షారోను ప్రార్ధనా మందిరం పాష్టర్ యేసుపాదం, ఏసయ్య ప్రార్దనా మందిరం చర్చి పాష్టర్ జమలయ్య, ఆయా సంఘాల క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










