Aug 09,2023 08:32

చిట్టీ పొట్టీ పాపాయి
చిన్నీ గౌనూ వేసింది
గజ్జల పట్టీ కట్టింది
పలకా బలపం పట్టింది

దేవునికి దండం పెట్టింది
అవ్వా వేలూ పట్టింది
బుడిబుడి అడుగులు వేసింది
వడి వడిగా బడికి వెళ్ళింది

చిట్టీ పొట్టీ పాపాయి
అక్షరమాలను నేర్చింది
చిట్టీ చిట్టీ చేతులతో
చదువుల తల్లికి మొక్కింది

అందరిలోనా పాపాయి
అన్నిట మేటిగ నిలిచింది
అందరి మన్ననలు పొందింది
ఆనందంగా గడిపింది

గణగణ గంట మోగింది
సంచి భుజాన వేసింది
టాటా.. బారు బారు..అంటూ
ఇంటికి బయలు దేరింది!
 

- ముక్కామల జానకీరామ్‌
63053 93291