
టోక్యో: జపాన్ మాస్టర్స్ సూపర్500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్ భారత్‌కు చెందిన చిరాగ్‌ాసాత్విక్ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో చిరాగ్-సాత్విక్ 21-16, 18-21, 16-21తో చైనీస్ తైపీకి చెందిన లూచింగ్-యంగ్-పోపై పోరాడిఓడారు. ఈ మ్యాచ్ గంటా 3నిమిషాలసేపు సాగింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి పురుషుల డబుల్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరిన భారతజంట ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో ఆశించినస్తాయిలో రాణించలేకపోతోంది. ఈ ఓటమికి ముందు భారత జంట తైపీ జంటపై 3-0 ఆధిక్యతలో ఉండగా.. తొలిసారి చైనీస్ తైపీ జంట చేతిలో ఓడారు.