డబ్బులు తీసుకుని గంజాయితో వెళ్తున్న కారును వదిలేసిన చింతూరు ఎస్సై
అల్లూరి సీతారామరాజు : డబ్బును తీసుకొని గంజాయితో వెళుతున్న కారును చింతూరు ఎస్సై వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల నెల్లూరులో గంజాయితో వెళుతున్న కారును, నిందితులను ఎస్‌ఈబీ అధికారులకు పట్టుకున్నారు. తమ వద్ద చింతూరు సబ్ డివిజన్‌లో ఓ ఎస్‌ఐ సొమ్ము తీసుకున్నట్లు విచారణలో గంజాయి నిందితులు వెల్లడించారు. దీనిపై వారు రంపచోడవరం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసుల బృందం నెల్లూరు పోలీసుల వద్దకు వచ్చి చింతూరు నుంచి సదరు ఎస్‌ఐను రంపచోడవరం పోలీసుస్టేషకు తరలించారు. అయితే అక్కడి నుంచి ఎస్‌ఐ పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలుస్తుంది.










