ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఎం.చిన నాగయ్య స్మారక పురస్కారానికిగాను ఉత్తమ కవితా సంపుటి, ఉత్తమ కథా సంపుటి, ఉత్తమ వ్యాస సంపుటి, ఉత్తమ జీవిత చరిత్ర విభాగాల్లో రచయితల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి ఎం.రాంప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రచయితలు రెండు ప్రతులను ఆగస్టు 31లోగా పంపాలని కోరారు. చిరునామా : ఎం.రాం ప్రదీప్, 10-263-6, ఆర్చ్ రోడ్డు, సాయి రాఘవ కాలనీ, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ 521235. ఫోన్ : 9492712836.










