Sep 06,2023 20:40

ఛాంగ్జూ(చైనా): చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లందరూ తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ 17-21, 21-11, 17-21తో ఇండోనేషియాకు చెందిన ఫికిర్‌-మౌలానా చేతిలో పోరాడి ఓడారు. తొలి గేమ్‌ను ఓడిన భారత డబుల్స్‌ జోడీ.. రెండో గేమ్‌ను చేజిక్కించుకుంది. పోటాపోటీగా సాగిన మూడో గేమ్‌ చివర్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో మహిళల డబుల్స్‌ జోడీతోపాటు సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు, లక్ష్యసేన్‌, ప్రియాంశు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చైనా ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసినట్లయ్యింది.