May 29,2023 09:59

మండే ఎండలో వేడెక్కే శరీరానికి చలువనిచ్చే కీర తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. కీర దోసకాయ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

  • ఈ కాలంలో చెమట రూపంలో నీరంతా బయటికి వెళ్లి శరీరం శక్తిని కోల్పోతుంది. కీరాలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్‌.. వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. తిరిగి శక్తిని పొందొచ్చు.
  • 96 శాతం నీరు ఉండే కీరా తినడం వల్ల శరీరానికి చలువ కూడా చేస్తుంది. కీరను ముక్కలుగా కట్‌ చేసి తినడంతో పాటు, పెరుగులో ముంచుకుని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఉండే విటమిన్‌ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
  • ఎండాకాలంలో రక్తపోటు, మధుమేహం ఉన్న వారు కీరను తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • వేడి ఎక్కువై కళ్లు మంట పుట్టడం, నీళ్లు కారడం జరుగుతాయి. అప్పుడు చల్లటి కీరదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • కీర దోసలో ఉండే కొన్ని సమ్మేళనాలు జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
  • కీర దోస క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడే కారకాలున్నట్టు కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఈ రసాన్ని వారంలో ఒకసారైనా తీసుకోవాలి.