
ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఐక్య ఉపాధ్యాయ సంఘం (యుటిఎఫ్) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా జిల్లా నుంచి కడియం గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యుటిఎఫ్ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ గా ఉన్న శ్రీనివాసరావు నూతన కమిటీలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన శ్రీనివాసరావును జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయకర్, షరీఫ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్. అరుణకుమారి, కోశాధికారి ఈవీఎస్‌ఆర్ ప్రసాద్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి ఏవి ఆనందకుమార్, ఆకుల వీర్రాజు అభినందించారు.