Jul 31,2023 08:08

       ఇటీవల బాల సాహిత్యానికి సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన సందర్భంగా డి.కె.చదువుల బాబుతో సంభాషణ టూకీగా.... సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం అందుకొన్న మీ అనుభూతి మాతో పంచుకోండి. సంతోషంతో పాటు బాధ్యత కూడా పెరిగిందనిపించింది. చేయవలసింది చాలా ఉందనిపించింది. నేను వ్రాయడమేకాక రచనా మెలుకువలను వివరించి కొత్తతరాన్ని తయారు చేసే పనిలో ఉన్నాను. నూతన రచయితలను తయారుచేయాలనే దఢ సంకల్పంతో ఉన్నాను.

                             పూర్వం లాగా పిల్లల పత్రికలు ఎక్కువగా రావడం లేదు. బాలసాహిత్యం భవిష్యత్తు ఏమిటి ?

ప్రత్యేకంగా పుస్తకాలు రాకపోయినప్పటికి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దిన, వార, మాసపత్రికల్లో బాలసాహిత్య రచనలను విరివిగా ప్రచురిస్తున్నారు. డజనుకు పైగా దినపత్రికకు ఆదివారం అనుబంధంగా వస్తున్న చిరు పుస్తకాల్లో కథలు వస్తూనే ఉన్నాయి కదా! తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు వ్రాసిన పుస్తకాల సంఖ్య వందల్లో ఉంది. పిల్లలు చదివే స్థాయి నుండి వ్రాసే స్థాయికి ఎదుగుతున్నారు. బాల సాహిత్య భవిష్యత్తు ఉజ్వలంగానే ఉంటుందన్నే నా భావన.
 

             పిల్లలు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ట్యాబ్లు చూస్తున్నారే తప్ప పుస్తకాలు చదవడంలేదు. పూర్వ వైభవం మళ్ళీ వస్తుందంటారా ?

చదవని పిల్లలున్నట్లే, చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. బాలసాహిత్యం విజ్ఞానానికి సోపానం. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు పిల్లలకు అనేక విషయాలు కథలరూపంలో చెప్పేవారు. గ్రంథాలయాల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి పుస్తకాల తెచ్చుకుని చదవడాన్ని ప్రోత్సహించేవారు. ఆ పుస్తకాలు పిల్లల్లో సజనాత్మకతను, విచక్షణాశక్తిని పెంచేవి. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పేవి. నేడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, ఉరుకు పరుగుల జీవితంలో టి.వి, సెల్‌ ఫోన్‌ పిల్లల సమయాన్ని తినేస్తున్నాయి. పిల్లలను బాలసాహిత్యానికి దగ్గర చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద ఉంది.
 

                                                    బాలసాహిత్యం విషయంలో మీ భవిష్య ప్రణాళిక ఏమిటి ?

వ్రాయడమేకాక రచనా మెలుకువలను వివరించి కొత్తతరాన్ని తయారు చేసే పనిలో నిమగమై ఉన్నాను. నా శిక్షణలో మా పాఠశాల విద్యార్థులు వ్రాసిన 20 కథలను 'కొత్తపేట కలాలు' పేరుతో ప్రచురించాను. నూతన పాఠకులను, రచయితలను తయారుచేయాలనే సంకల్పంతో ఉన్నాను.
 

- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య
9490400858