Dec 05,2022 08:16

విశ్వేశ్వరయ్య ఇండిస్టియల్‌ అండ్‌ టెక్నాలజికల్‌ మ్యూజియం (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌, సాంస్క ృతిక శాఖ) భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం దక్షిణ భారత ప్రాంతీయ స్థాయి సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌ను ఏటా డిసెంబర్‌లో నిర్వహిస్తారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన మహే, పుదుచ్చేరి నుంచి దశలవారీ పోటీల నుంచి ఎంపికైన నాటికలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆ విధంగా 12 నాటికలు ఎంపిక పూర్తి చేసి జోన్‌స్థాయిలో, దేశంలోని ఆరు జోన్లకు కలిపి జనవరిలో జాతీయస్థాయిలో పోటీ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జాతీయ సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌ 2023 జనవరి 4, 5 తేదీల్లో బెంగళూరులోనే జరగనుంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం మానవాళి ప్రయోజనాల కోసమే అన్న ఇతివృత్తంతో ఈ పోటీలను ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు.
            ఎస్సీఈఆర్టీ సహాయంతో వివిధ రాష్ట్రాల్లో తొలుత దశలవారీ పోటీలు నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్‌, ప్రాంతీయ భాషల్లో ఈ ప్రదర్శనలు ఇవ్వవచ్చు. ఈసారి దక్షిణాది ఫెస్ట్‌కి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల నుంచి ఎంపిక పోటీలు నిర్వహించలేదు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, పుదుచ్చేరిల నుంచి ఎనిమిది నాటికలు పోటీపడ్డాయి. ఈ ఫెస్టివల్‌ డిసెంబర్‌ 1న ఉదయం బెంగళూరు విశ్వేశ్వరయ్య మ్యూజియం ఆడిటోరియంలో ప్రారంభమైంది. రంగస్థలం నట దర్శకులు డాక్టర్‌ బివి రాజారాం ముఖ్య అతిథిగా విచ్చేయగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాస్ట్రోఫిజిక్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అన్నపూర్ణి సుబ్రహ్మణియన్‌ సభకు అధ్యక్షత వహించారు. ముగింపు సభ రెండో తేదీ. జరిగింది. ఈ సైన్స్‌ డ్రామా ఉత్సవం- పోటీలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైన్స్‌ ప్రచారకులు తమ ప్రయోగాలు రంగస్థల లబ్ధి పొందేందుకు నిర్వహిస్తారు. సైన్స్‌ అండ్‌ సొసైటీ ఈ సంవత్సరం ప్రధాన థీమ్‌ కాగా, వాక్సిన్స్‌ కథ, పాండెమిక్స్‌ అండ్‌ సోషల్‌ సైంటిఫిక్‌ అంశాలు, జీవన ప్రమాణాలను పెంచడంలో శాస్త్ర సాంకేతిక కొత్తదారులు, బేసిక్‌ సైన్సెస్‌, నిరంతరాభివృద్ధి- సబ్‌ ధీమ్స్‌. ఈ నాలుగింటిపై బెంగళూరు విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యూజియంలో వారి సారధ్యంలోనే రానున్న కొత్త సంవత్సరంలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి.

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655