Jul 07,2023 08:35

ఎండల నుంచి ఊరటనిచ్చే వర్షాకాలం పిల్లలకు ఎంతో ఇష్టం. చల్లదనం, ఆనందంతో పాటే వర్షాకాలంలో పిల్లలు కాస్త తొందరగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడే అవకాశమూ ఉంటుంది. ముందుగానే పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి సిద్ధం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

  • జంక్‌ ఫుడ్‌ జోలికి పోకుండా సమతుల్య ఆహారం తినిపించండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం, రోడ్డు పక్కన చిరుతిళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌, సరిగ్గా ఉడకని లేదా పచ్చిగా ఉన్న ఆహారం తినిపించకండి.
  • కాచి చల్లార్చిన వేడి నీళ్లను తాగించండి. స్కూల్‌కి వెళ్లేటపుడు కూడా అవే నీళ్లను బాటిల్‌ లో పోసి ఇవ్వండి.
  • వాళ్ల వయసు ప్రకారం వాళ్లకు వేయించాల్సిన వ్యాక్సినేషన్లు పూర్తిచేయండి. ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచండి. దోమలు పెరగకుండా జాగ్రత్తపడాలి. వాటివల్ల మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
  • తడిగా ఉండే బట్టలు, షూలు వేయకండి. వాట ివల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
  • భోజనం చేసే కన్నా ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. త్వరగా ఆరిపోయే బట్టలు వేయండి.
  • బయట ఆడుకునే వీలు లేకపోతే, శారీరక వ్యాయామం కోసం ఇంట్లోనే స్కిప్పింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌ లాంటి ఆటలు ఆడేలా ప్రోత్సహించండి.
  • రెయిన్‌ కోట్లు, గొడుగులు, నీళ్ల నుంచి రక్షించే గమ్‌ బూట్స్‌ సిద్ధం చేయండి.
  • తులసి, దాల్చిన చెక్క, నిమ్మకాయం, అల్లం లాంటి మూలికల్ని వాళ్ల ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటూ జ్వరాలు రాకుండా కాపాడతాయి.
  • పిల్లల్లో ఎలర్జీ సమస్య ఉంటే కార్పెట్లు, కర్టెన్లు లాంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే పిల్లలకు సోకకుండా జాగ్రత్తపడండి. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేస్తూ ఉండండి.
  • ఈ కాలంలో మురికి నీళ్లలో ఆడుకుంటే జరిగే నష్టాలు చెప్పండి. వాళ్లే దూరంగా ఉంటారు.
  • పొడవాటి చేతులున్న షర్టులు, ప్యాంట్లు వేయండి. దోమల నుంచి ఇవి రక్షిస్తాయి. అవసరమైతే ఇంట్లో దోమతెర వాడండి.బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవడం అలవాటు చేయండి.