May 06,2023 15:00

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16.. 49వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దారుణంగా విఫలమైంది. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 139పరుగులే చేయగల్గింది. ఓ దశలో 14పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పీకల్లోతో కష్టాల్లో పడ్డ ముంబైని నెహాల్‌ వధేరా (64), సూర్యకుమార్‌(26) ఆదుకున్నారు. ముఖ్యంగా, చెన్నై బౌలింగ్‌ను సమర్థవంతంగా నెహాల్‌ వధేరా ఎదుర్కొని అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం. చివర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 21 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. ఇషాన్‌ కిషన్‌ (7), కామెరూన్‌ గ్రీన్‌ (6), రోహిత్‌ శర్మ(0), టిమ్‌ డేవిడ్‌ 2, జోఫ్రా ఆర్చర్‌ 4, పీయూష్‌ చావా(2) తక్కువ పరుగులు చేశారు. మతీషా పతిరణ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీపక్‌ 2, తుషార్‌ దేశ్‌పాండే 2, జడేజా 1 వికెట్‌ తీసుకున్నారు.

  • టీమ్‌ డేవిడ్‌ ఔట్‌

తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో టీమ్‌ డేవిడ్‌ ఔటయ్యాడు. ముంబై ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సరకి 134 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌ , అర్షద్‌ఖాన్‌ ఉన్నారు.

  • నెహాల్‌ వధేరా ఔట్‌

మతీషా పతిరణ బౌలింగ్‌లో నెహాల్‌ వధేరా (64) పరుగులు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. నెహాల్‌ వధేరా 51 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 64 పరుగులు చేశాడు. క్రీజులోకి టీమ్‌డేవిడ్‌ వచ్చాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ 13 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • నెహాల్‌ వధేరా 50

జట్టు కష్టాలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నెహాల్‌ వధేరా ఆచితూచి ఆడుతూ.. హాఫ్‌సెంచరీ పూర్తి చేస్తున్నాడు. ముంబై 17 ఓవరు పూర్తయ్యే సరికి 122 పరుగులు చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ 14 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

 

  • 14 ఓవర్లుకు .. ముంబై 86/4

14 ఓవర్లు ముంబై 86 పరుగులు చేసింది. నెహాల్‌ వధేరా 39 బంతుల్లో 39 పరుగులు, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 7 బంతుల్లో 5 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • సూర్య ఔట్‌.. ముంబై 69/4

22 బంతుల్లో 26 పరుగులు చేసిన సూర్యకుమార్‌ జడేజా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ముంబై 69 పరుగుల వద్ద 4వ వికెట్‌ను కోల్పోయింది. క్రీజులోకి ట్రిస్టన్‌ స్టబ్స్‌ వచ్చాడు. నెహాల్‌ వధేరా 28 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 10 ఓవర్లు పూర్తి

10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 26, నెహాల్‌ వధేరా 22 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 8 ఓవర్లు పూర్తి.. ముంబై 55/3

8 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. సూర్యకుమర్‌ యాదవ్‌ 14 బంతుల్లో 20 పరుగులు, నెహాల్‌ వధేరా 18 బంతుల్లో 19 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • పవర్‌ ప్లే పూర్తి.. ముంబై 36/3

పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి ముంబై 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. సూర్యకుమార్‌, నెహాల్‌ వధేరా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. కాగా కామెరూన్‌ గ్రీన్‌ (6), ఇషాన్‌(7), రోహిత్‌ శర్మ (0) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

  • రోహిత్‌ డక్‌ ఔట్‌.. ముంబై 14/3

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్శ్‌ డక్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీపక్‌ చాహార్‌ వేసిన 3 ఓవర్‌లోని 5వ బంతిని అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి రవిద్ర జడేజాకు చిక్కాడు. కాగా దీపక్‌ చాహర్‌కు ఒకే ఓవర్‌లో రెండో వికెట్‌ దక్కింది. క్రీజులోకి సూర్యకుమర్‌ వచ్చాడు.

 

  • ఇషాన్‌ ఔట్‌

దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ మహేశ్‌ తీక్షణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్‌ 9 బంతుల్లో 7 పరుగులు చేశాడు. క్రీజులోకి నెహాల్‌ వధేరా వచ్చాడు. ముంబై ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది.

  • తొలి వికెట్‌ డౌన్‌.. గ్రీన్‌ ఔట్‌

టాస్‌ ఓడిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. క్రీజులోకి రోహిత్‌ శర్మ వచ్చాడు. ముంబై ప్రస్తుతం వికెట్‌ నష్టానికి13 పరుగులు చేసింది.

  • బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబై.. తొలి ఓవర్‌ 10/0

టాస్‌ ఓడిన ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఈ సారి రోహిత్‌ శర్మ కాకుండా కామెరూన్‌ గ్రీన్‌ను ఒపెనర్‌గా బరిలోకి వచ్చాడు. ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కాగా దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లో ముంబై 10 పరుగులు చేసింది.

  • టాస్‌ గెలిచిన చెన్నై.. తొలుత బౌలింగ్‌

చెన్నై : చెన్నైలోని చెపాక్‌ స్టేడియం మరో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సుపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోని తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేయనుంది. వరుస విజయాలతో ముంబై మంచి జోష్‌లో ఉండగా. గత రెండు మ్యాచుల్లో విఫలమైన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. తిలక్‌వర్మ స్థానంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌.. కుమార్‌ కార్తికేయ స్థానంలో ఆర్‌ రాఘవ్‌ గోయల్‌ జట్టులోకి వచ్చారు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ : రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ, దీపక్‌ చాహర్‌, మతీషా పతిరణ, తుషార్‌ దేశ్‌పాండే, మహేశ్‌ తీక్షణ
ముంబై ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ(సి), ఇషాన్‌ కిషన్‌, కామెరూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్‌ డేవిడ్‌, నెహాల్‌ వధేరా, జోఫ్రా ఆర్చర్‌, పీయూష్‌ చావ్లా, ఆకాష్‌ మధ్వల్‌, అర్షద్‌ ఖాన్‌