Jul 09,2023 13:08

న్యూఢిల్లీ: అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో పాల్గొనేందుకు సిద్ధమైన అంబటి రాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.. ఐపీఎల్‌ టీమ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కే చెందిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌కు రాయుడు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. 'వ్యక్తిగత కారణాలతో రాయుడు తొలి ఎంఎల్‌సీలో పాల్గొనడం లేదు' అని టెక్సాస్‌ టీమ్‌ ప్రతినిధి ప్రకటించారు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు 'కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌' ముగిసిన తర్వాతే వారిని అనుమతించాలని బోర్డు భావిస్తోంది. ఇదే కారణంతో రాయుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం.