
ప్రజాశక్తి-గుంటూరు : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. రాయుడు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌ను కలిసినప్పటి నుంచి రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిపై ఆయన స్పష్టంగా ఇప్పటి వరకు బదులివ్వలేదు. నిన్న గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. గ్రామీణుల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటిలో తాను ఏ పనులు చేయగలను, ఏయే అవసరాలను తీర్చగలనన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడతానని స్పష్టం చేశారు. ప్రజల నాడి తెలుసుకునేందుకు పర్యటిస్తున్నాని తెలిపాడు.