ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌ను రాజస్తాన్ ఫ్రాంచైజీ నియమించింది. షేన్ బాండ్ రాజస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్తాన్ వెల్లడించింది. కాగా షేన్ బాండ్ 9 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగాను తమ బౌలింగ్ కోచ్‌గా ముంబై నియమించింది. అయితే గత రెండు సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగా పని చేశాడు.