
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ధోనీ సేనకు అహ్మదాబాద్ నగరంలోని ఐటీసీ నర్మదా హౌటల్‌లో బస ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై జట్టు నేరుగా హౌటల్‌కు చేరుకుంది. గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో వారికి స్వాగతం పలికారు. హౌటల్ లాంజ్‌లో గుజరాతీ నత్యాలు, పలు కళారూపాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Huge welcome for Dhoni & CSK in Ahemdabad pic.twitter.com/PrqIZL8ETI
— Johns. (@CricCrazyJohns) May 27, 2023