
అహ్మదాబాద్ : భారీ వర్షం కారణంగా ఆదివారం(మే28) జరగాల్సిన ఫైనల్ రిజర్వేడే సోమవారంకు వాయిదా పడిన విషయం విధితమే. ఈ టైటిల్ పోరులో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే రిజర్వ్‌డే రోజు సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రత 35డిగ్రీలగా ఉంది. ప్రస్తుతం వాతావరణం బాగా ఉన్నప్పటికీ సాయంత్రంకు ఎలా మారుతుందో వేచి చూడాలి.