Aug 28,2023 21:28

హైదరాబాద్‌ : దిగ్గజ చమురు, గ్యాస్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ను నియమించుకుంది. తమ వినియోగదారులకు వంట సమయంలో గ్యాస్‌ వృధాను తగ్గించడానికి అనుసరించాల్సిన విధానాలపై సంజీవ్‌తో ప్రచారం కల్పించనున్నట్లు ఐఒసి పేర్కొంది. దీనికి సంబంధించిన నూతన వాణిజ్య ప్రకటనను ఐఒసి మార్కెటింగ్‌ డైరెక్టర్‌ వి సతీష్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కె శైలేంద్ర, పి గుర్‌ ప్రసాద్‌, సందీప్‌ శర్మ, చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ ఆవిష్కరించారు.