వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు; అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కాలంలో చీమలు ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ చికాకు పెడతాయి. ఇంట్లో దొరికే వస్తువులతోనే వాటి బెడదను తప్పించుకోవచ్చు.
- ఒక వంతు డిష్ సోప్, రెండు వంతుల నీటితో ద్రావణం తయారుచేసి, సీసాలో పోయండి. ఇంటి మూలలో లేదా గోడపై చీమలు కనిపించిన చోట ఈ ద్రావణాన్ని పిచికారీ చేయండి.
- స్ప్రే బాటిల్‌లో సగం నీరు, సగం వైట్ వెనిగర్ ద్రావణాన్ని కలిపి కూడా పిచికారీ చేయవచ్చు.
- అలాగే స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నిమ్మరసం కలిపిన నీటిని స్ప్రే చేసినా చీమలు పోతాయి.
- చీమలు ఎక్కువగా కనిపించిన చోట బోరిక్ యాసిడ్ చల్లితే చీమలు చనిపోతాయి.
- ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్క , నిమ్మ తొక్కలను గది మూలలో ఒక గిన్నెలో ఉంచితే, చీమల బెడద తగ్గుతుంది.
- ఇంటిని తుడిచే నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి శుభ్రపరిస్తే చీమలు తగ్గుతాయి.
- దాల్చిన చెక్క పొడిని చల్లినా చీమల బెడద తగ్గుతుంది.
- పుదీనా నూనెను పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది.
- బేబీ పౌడర్‌ని చీమలపై చల్లినా చీమలు రావడం తగ్గుతుంది.
- కాఫీ గింజలు లేదా కాఫీ పొడిని చీమలు ఉన్న ప్రదేశంలో చల్లితే చీమలు రావు.
- చాక్‌పీస్‌లను మెత్తగా నూరి చీమలు వచ్చే ప్రదేశంలో చల్లినా వాటి బెడద తగ్గుతుంది.










