ప్రజాశక్తి - పుత్తూరు టౌన్(తిరుపతి) : పుత్తూరు ఆర్టీసీ డిపోలో మే నెలకు సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లకు మేనేజర్ ప్రశాంతి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుత్తూరు డిపోకు సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగుల్లో డ్రైవర్ ఏసీ ప్రసాద్, ఎస్ కరిముల్లా, ఎం.విజరు కుమార్, డి.చంద్రయ్య, ఎస్.అంకయ్య, ఐదు మంది డ్రైవర్లు గ్యారేజీలో ఎలక్ట్రిషన్ పనిచేస్తున్న డి.గోవిందరాజు, ఒక ఎడిసి మొత్తం ఏడుగురికి ప్రశంసా పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ మంగమ్మ, యూనియన్ నాయకులు, ప్రతాప్, కార్మికులు పాల్గొన్నారు.










