- క్రిక్‌పే ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యాపారులను వేదిస్తోందని క్రిక్‌పే ఫౌండర్, భారత్‌పే మాజీ బాస్ అశ్నీర్ గ్రోవర్ ఆందోళన వ్యక్తం చేశారు. బకాయల పేరుతో పన్ను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్‌ఎంజి) కంపెనీలు రూ.55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్‌ఎంజి సంస్థలకు ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) విభాగం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అశ్నీర్ గ్రోవర్ తీవ్రంగా స్పందించారు. డిజిజిఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమేనన్నారు. మరోవైపు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్‌పై 28 శాతం జిఎస్‌టి విధింపును ఆయన తప్పుబట్టారు.