ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 105 వ జయంతి వేడుకులను కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నందిగామలో ఘనంగా నిర్వహించారు. గాంధీసెంటర్లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ... బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాకే దక్కిందన్నారు. పేదలకు కూడూ, గుడ్డ, గుడిసె కల్పించారని కొనియాడారు. ప్రధానమంత్రిగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాలేటి సతీష్, కామా శ్రీనివాసరావు,గోపు నరేంద్ర, గింజుపల్లి అనిల్, చిట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు.










