ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం జిల్లాలో రోటరీ క్లబ్ విశాఖపట్నం, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్ట్ క్లబ్స్ కాన్ఫెరెన్స్ పోస్టర్ ను బుధవారం ఉదయం స్థానిక ఎల్ ఐ సి క్వార్టర్ బి 25 లో పిడిఎఫ్ ఎంఎల్సీ అభ్యర్థి కె.రమప్రభ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాన్ఫెరెన్స్ చైర్ రొటేరియన్ మోదాంబికా దేవి మాట్లాడుతూ ... రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఈ నెల 18 న నిర్వహిస్తున్న ఇంటరాక్ట్ కాన్ఫెరెన్స్ అభ్యాస్ ను జయప్రదం చేయాలని ఈ కాన్ఫెరెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. దీనిలో రోటరీ ప్రముఖులు పాల్గంటారు అని తెలియజేశారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఫౌండర్, పిడిఎఫ్ ఎంఎల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ మాట్లాడుతూ ... పిల్లలకు ఉపయోగకరమైన అనేక విజ్ఞాన, సాంస్కఅతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మొత్తము జిల్లాలో ఉన్న 100 ఇంటరాక్ట్ క్లబ్స్ నుంచి 500 మంది పిల్లల ప్రతినిధులు పాల్గొంటారు అని, ప్రతి క్లబ్ కూడా ఈ అవకాశంని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్.హరిత, కో కన్వీనర్ డి.శైలజ, సభ్యులు డి.నీలవేణి, ఎస్.నాగమణి, బి.గణేష్ పాల్గొన్నారు.










