ప్రజాశక్తి-సి.బెళగల్ (కర్నూలు) : పాడి పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల్లో భాగంగా గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం ఏమాత్రం తగదని కొత్తకోట పశువైద్యులు సివి.సుంకన్న రైతులకు సూచించారు. మంగళవారం గాలికుంటు వ్యాధిపై డాక్టర్లు పాడి శిబిరం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడే కొత్తకోట పరిధిలో 4330 పాడి పశువులున్నాయని ఇప్పటికే 3240 పశువులకు వ్యాధినివారణ చికిత్స చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.










