Oct 02,2023 13:41

తిరువనంతపురం :   గూగుల్‌ మ్యాప్‌తో ఇద్దరు వైద్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మ్యాప్‌ ఆధారంగా వెళ్తున్న కారు నదిలోకి వెళ్లడంతో ఇద్దరు వైద్యులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో జరిగింది. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా వెళ్తున్న ఓ కారు పెరియార్‌ నదిలోకి వెళ్లింది. భారీ వర్షం కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారికి రహదారి సరిగా కనిపించకపోవడం, లెఫ్ట్‌ టర్న్‌ తీసుకోవాలని గూగుల్‌ మ్యాప్‌ సూచించడంతో కారు నదిలో మునిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ అద్వైత్‌(29), అజ్మల్‌(29)లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.