Nov 05,2023 07:38

మండే గుండెల్లో
మాయని గాయాలెన్నో ?

కడలి అలల కల్లోలంలో
తీరం చేరని బతుకు నావలెన్నో ?

శిథిలమైన జీవితాల్లో
పదిలమైన జ్ఞాపకాలెన్నో ?

చలించే కాలంలో
ఫలించని జీవితాలెన్నో ?

పొడుస్తున్న ఉదయాలలో
విచ్చుకోని హృదయాలెన్నో ?

ఆశల చీకటిలో
అందరాని వెలుగు పూలెన్నో ?

నేతలు రాసిన రాతల్లో
చిక్కుకున్న తలరాతలెన్నో ?

కనులు మూసిన రేయికి
తెలవారని బతుకులెన్నో ?

నిస్పృహల నిశీధిలో
నైరాశ్యమొందే దు:ఖితులెందరో ?

పొత్తిళ్ళు కూర్చిన ఆనందంలో
ఒత్తిళ్ళు మిగిల్చిన విషాదాలెన్నో ?

నిష్కపట చెమట చుక్కలు రాల్చిన
నిరాశల నులివెచ్చని కన్నీళ్ళెన్నో ?

శిశిరం ముసిరిన జీవిత తరువులకు
వసంతం విరియని తనువులెన్నో ?

ప్రశ్న నుండే ఉద్భవించిన ప్రగతి
ప్రశ్నై మిగిలిన జీవితాలకేల ఈ గతి?
 

- వెంకట్‌ అడ్డాల,
సెల్‌ : 9666181948