Aug 16,2023 11:58

ప్రజాశక్తి-వడ్డాది (అనకాపల్లి) : బుచ్చయ్య పేట మండలం వడ్డాది జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పది తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు పూర్వ విద్యార్థులు బుధవారం ఆర్థికసాయాన్ని అందజేశారు. 1991-92 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఏటా మాదిరిగా ఈ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి నగదు పురస్కారాలను అందిస్తున్నారు. ఈ ఏడాది 500పైన మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు గగన్‌ తేజ, సందీప్‌, అభిషేక్‌, యస్వంత్‌ లకు రూ.1000 చొప్పున నగదు, ప్రశంసా పత్రం అందించారు. పూర్వ విద్యార్థులు ఆది పోలిబాబు, దొండా వరహాలబాబు, కృష్ణం రాజు, రవి, నాగేష్‌, ప్రసాద్‌, హెచ్‌ఎం శేషుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.