హైదరాబాద్ : కన్స్యూమర్ లెండింగ్ వేదిక పైబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ల్లో ఒక్కటైన కేర్ హాస్పిటల్స్ ప్రకటించింది. దీని ద్వారా రోగులు రూ.10 లక్షల వరకు జీరో కాస్ట్ ఇఎంఐ రుణాలను పొందవచ్చని తెలిపింది. అన్ని రకాల చికిత్సలకు పైబ్ రుణ మద్దతును అందించనుందని పేర్కొంది. తొలుత ఈ సేవలు హైదరాబాద్, భువనేశ్వర్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో లభ్యమవుతాయని వెల్లడించింది. ఫైబ్‌తో తమ భాగస్వామ్యం రోగులు, వారి కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల ఎదురయ్యే ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు సహాయపడనుందని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ సిఎఫ్‌ఒ వికాస్ రస్తోగి తెలిపారు.










