Mar 31,2023 08:18

యాలకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్‌, ప్రొటీన్‌, కాల్షియం, పొటాషియం మొదలైనవి ఉంటాయి.
రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు వేసుకొని ఆ నీరు తాగటం వల్ల కొవ్వు కరిగిపోతుంది.
పచ్చి యాలకులు యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటాయి, వాటిని రోజూ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యాలకులలోని పొటాషియం, పీచు పదార్థం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
రోజూ యాలకులు తింటుంటే యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది.