Jun 26,2023 07:19

పల్లవి :
వినపడలేదా పోలవరం పోరు కేక
కనబడలేదా గోదావరి ముంపుఘోష
తరతరాల చరిత్రను మా తాతల
పాద ముద్ర లోదిలిసి పొమ్మంటే...
పోతామనుకున్నారా....
తిరగ బడలేమనుకున్నారా ..
చరణం :1
లక్షలాది జనం ఇళ్లు జలగండం అవుతుంటే ...
కోట్లకొలది ప్రజల ఆస్తి
నీట మునిగిపోతుంటే ...
కనపడ లేదా... 2
చరణం : 2
అడవితల్లి బిడ్డలు,
గోదారి పువ్వులు
స్వచ్ఛమైన మనసులు,
ప్రకృతి గిరిపుత్రులు ...
కనపడలేదా... 2
చరణం : 3
పోలవరం ప్రాజెక్టులో
సర్వం కోల్పోతుంటే
నిర్వాసిత గిరిజనులకు
నిలువ నీడ లేకుంటే
కనపడ లేదా...2

చరణం : 4
సిగ్గులేని ప్రభుత్వాన్ని
నిగ్గ దీసి అడిగేందుకు
సంద్రం ఉప్పొంగినట్టు
జన జాతర కదిలొస్తుంటే
కనపడ లేదా...2
అది గదిగో జనం జనం
రగిలింది రణం రణం
మండుతున్న అగ్నికణం
కదిలింది ఎర్ర ప్రభంజనం
చూస్తుంది మీ పాలన అంతం

- రెడ్డి శంకరరావు
94943 33511