ప్రజాశక్తి-రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ''ఆయుష్మాన్ భారత్'' కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్‌పై అవగాహనా సైకిల్ ర్యాలీ, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. రెడ్డిగూడెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ సందేశ్ , డాక్టర్ చెన్నకేశవ ఆధ్యర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్‌లు, సిబ్బంది, ఆశ వర్కర్లు, గీతాంజలి స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










