అనకాపల్లి: అనకాపల్లిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే ఎన్టీఆర్ క్రీడా మైదానానికి విద్యార్థినులను పిలిపించారు. 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. పిల్లంతా సరిగ్గా సమయానికే వచ్చినప్పటికీ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాత్రం తీరిగ్గా 10.45 గంటలకు మైదానానికి చేరుకున్నారు.అప్పటివరకు విద్యార్థినులు, తల్లిదండ్రుల ఎండలోనే నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కసింకోట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కౌసల్య కళ్లు తిరిగి కింద పడింది. అక్కడే ఉన్న తోటి విద్యార్థినుల తల్లిదండ్రులు విద్యార్థినికి సపర్యలు చేశారు. బాలికలు కూర్చునేందుక కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. చివరకు చేసేది లేక అక్కడే ఉన్న చెట్టునీడన చేరారు.